ఆమ్రపాలి. గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గా పనిచేశారు ఆమె. ఆ తర్వాత ఆమె జీహెచ్‌ఎంసీకి బదిలీ అయ్యారు. అక్కడ అడిషనల్‌ కమిషనర్‌ గా కొనసాగుతున్నారు. వారిని కేంద్ర సర్వీసులోకి పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్స్ అందాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు ఓఎస్డీగా ఆమ్రపాలి కాటా, అడిషనల్‌ పీఎస్‌గా కె.శశికిరణాచారి వెళ్లనున్నారు.

ఆమెను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు వచ్చాయి. ఆమె ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెతో పాటూ మరో ఐఏఎస్ అధికారిని కేంద్ర సర్వీసులోకి బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. కేంద్ర సర్వీసుల్లోకి పంపాలని కేంద్ర హోమ్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అందాయి. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న జి.కిషన్‌ రెడ్డి కార్యాలయంలో ఓఎస్డీగా (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఆమ్రపాలి, అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా కె.శశికిరణాచారి విధుల్లో చేరనున్నారు.