టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ . ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటమి తప్పదంటూ కేటీఆర్ చేసిన వాఖ్యలపై నారా లోకేశ్ ట్విటర్‌లో స్పందించారు. ‘‘దిల్లీ మోదీ, తెలంగాణ మోదీ కేసీఆర్, ఏపీ మోదీ జగన్‌కు కలలో కూడా చంద్రబాబే గుర్తొస్తున్నారు” అని ట్వీట్ చేశారు.
అలాగే ”ఫెడరల్ ఫ్రంట్ అంటూ చివరకు 420 జగన్‌తో జతకట్టి తెలంగాణకే పరిమితం అయ్యారు. టీడీపీ ఓటమి కోసం కృషి చేసే కేసీఆర్‌కు భంగపాటు తప్పదు. ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక, ముగ్గురు నాయకులు ఒక్కటై కుట్రలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడలేక జగన్‌తో చేతులు కలిపారు. ఏపీని అతలాకుతలం చేసేందుకు తెరాస వస్తోందనే సంగతి కేటీఆర్ మాటల్లో తేలిపోయింది’’ అని సమాధానం ఇచ్చారు లోకేష్…
కేటీఆర్ చిట్ చాట్:
5 MLC సీట్లు కచ్చితంగా గెలుస్తాం.
ఉత్తమ్ MLC ఎన్నికలలో తమ అభ్యర్థి విషయంలో సహకరించమని కోరారు.
మాకు సరైన సంఖ్య ఉంది అందుకే అభ్యర్థుల పేర్లు ప్రకటించాం.
MIM పార్టీ మాకు మిత్ర పక్షం.
డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఉత్తమ్,బట్టి ని కలిశాను.
కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నట్టు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీ అనేలా ఉండదు.
ఢిల్లీని శాసించాలంటే 16 MP సీట్లు గెలవాలి.
ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వచ్చింది.
జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ కు 2014 లో 48 ఎంపీ సీట్లు వచ్చాయి.
వందసీట్లు గెలిచే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు.
బయ్యారం ఉక్కు పరిసర రావాలంటే కేంద్రాన్ని
Ap లో వైసిపి తప్పకుండా గెలుస్తుంది.
చంద్రబాబు నిద్రలో కూడా కేసీఆర్ అని కలవరిస్తున్నాడు.
పక్క పార్టీల పై ఏడవకుండా రాష్ట్రానికి ఎం చేశావు వీహెప్పి ఓట్లు అడుగు చంద్రబాబు.
చంద్రబాబు 100శాతం ఒడిపోతాడు.
ఢిల్లీలో కాదు,అమరావతిలో కూడా చక్రం తిప్పలేడు.
ఆంధ్రలో పారిశ్రామిక వేత్తలపై ఐటీ రైడ్స్ అయితే చంద్రబాబుకు ఎందుకు బాధ.
చంద్రబాబు కు బినామీలు ఉన్నారా.
ఎందుకు ప్రతి దానిపై నిందలు వేయడం బాబు.
చంద్రబాబు ఖాళీగా ఉన్నాడు,మాకు చాలా పనులు ఉన్నాయి.
జాతీయపార్టీలకు సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నైరాశ్యంలో ఉంది
తెలంగాణ ప్రజలు ఢిల్లీని శాసిద్దం అనే నినాదంతో ఎన్నికలు వెళ్తున్నాం.
పుల్వామా దాడి విషయంలో బీజేపీ వైఫల్యం ఉంది.
సిట్టింగ్ ప్రధాని మోదీ అందుకే సర్వేలలో మళ్ళి ప్రధాని మోడీ అని పెరు ముందు ఉంది.
ప్రజలు చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. భావోద్వేగాలతో గెలుపు సాధ్యం కాదు.