టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. పదవులు వచ్చింది పార్టీ వల్లేనని గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజలే బాసులనే విషయాన్ని నేతలు గుర్తించుకోవాలన్నారు. 

Advertisement

మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీకి ఓనర్లం తామేనని చెబుతూ తనకు వచ్చిన పదవి ఎవరి భిక్షా కాదన్నారు. కులం పేరుతో తాను మంత్రి పదవి సాధించలేదని, ప్రజల అండతోనే నెగ్గి మంత్రినయ్యానని ఈటల చెప్పారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాటలు కలకలం రేపుతున్నాయి. ఈటల మాటలను దృష్టిలో ఉంచుకునే కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.