విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్ ఉంది. 1999 ఫిబ్రవరి 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి ఈపీఎఫ్ విధానం కూడా అమలుచేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. ఇదే తరుణంలో అటు విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టనున్నారు. డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో చర్చలు విఫలమైనందువల్లే సమ్మె నిర్ణయానికి వచ్చామని విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ తెలిపింది.

Advertisement

ఈ మేరకు 23 తర్వాత మెరుపు సమ్మెకు దిగాలని విద్యుత్ ఉద్యోగులకు ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది. మంగళవారం విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, విద్యుత్ అధికారులతో యూనియన్ నాయకులు చర్చలు జరిపారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్ ఉంది. 1999 ఫిబ్రవరి 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి ఈపీఎఫ్ విధానం కూడా అమలుచేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

అయితే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని ట్రాన్స్‌కో జేఎండీ అన్నారు. దానికి బదులు వారికి బేసిక్ సాలరీతో పాటు మరిన్ని బెనిఫిట్స్ కల్పిస్తామన్నారు. అయితే కార్మికులు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు.

విద్యుత్ యాజమాన్యంతో TETUF చర్చలు:

విద్యుత్ యాజమాన్యంతో TETUF నాయకత్వం చర్చలు నిన్న సాయంత్రం 4 గంటల నుండి 5 గంటలకు ముగిసినవి. ఈ చర్చలలో యాజమాన్యం ఆర్టిజన్ కార్మికులకు APSEB రూల్స్ వర్తింపజేయడం కష్టమవుతుందని న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని పాత వాదనను వినిపిస్తూ స్టాండింగ్ ఆర్డర్స్ ను వర్తింప చేస్తూ త్వరలో మూల వేతనం ఏర్పాటు చేసుకుందామని ఇతర కొన్ని సౌకర్యాలు స్థానంలో లో ఏర్పాటు చేద్దామని, DA స్థానంలో లో VDA పాయింట్లు, చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఏర్పాటు చేద్దామని మరియు ఇతర అంశాల ఆలోచన చేద్దామని ఈ విషయంలో టఫ్ నాయకత్వం సహకరించాలని యాజమాన్య ప్రతినిధులు ట్రాన్స్కో, JMD శ్రీ శ్రీనివాస్ రావు గారు మరియు ఇతర డైరెక్టర్లు కోరారు. అదే విధంగా ఇతర డిమాండ్లు కూడా చర్చిద్దామని, EPF to GPF విషయంలో గౌరవ ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దామని తెలియపరిచారు.

స్పందించినట్లు టఫ్ నాయకత్వం యాజమాన్య వైఖరి సరైనది కాదని తమరి పై గౌరవంతో ఈనెల 11న జరగవలసిన చలో ” వరంగల్ ధర్నా ” కూడా ఉపసంహరించుకొని చర్చలకు వచ్చామని అయినప్పటికీ మీ వైఖరి మరియు ఆలోచనలలో మార్పు రానందున మేము ఈ సమావేశం నుండి వెళుతున్నామని ఈరోజు జరిగే ” SPDCL ధర్నా ” యధావిధిగా కొనసాగుతుందని ఘాటుగా తెలియపరచారు.