కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ ఆత్మహత్య AK 47 వెపన్ తో కాల్చుకొని చనిపోయిన వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లా వాలిగొండకు చెందిన వెంకటేశ్వర్లు. సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య కలకలం రేపుతోంది. 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు గన్‌తో కాల్చుకుని చనిపోయాడని చెబుతున్నారు.

Advertisement

ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గజ్వేల్‌కు తరలించారు. మృతుడు వెంకటేశ్వర్లు స్వగ్రామం నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామం. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.అధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమన్న ప్రచారం జరుగుతోంది.

పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.