టీఆర్ఎస్ కు రాజీనామా కై: కొండా సురేఖ దంపతులపై కార్యకర్తల ఒత్తిడి
తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేయాలంటూ కొండా సురేఖ దంపతులపై కార్యకర్తలు ఒత్తిడి తీసుకువస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత ప్రకటించిన తొలి జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో ఆమె వర్గీయులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ దంపతులు తమ అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు, హన్మకొండ రామ్‌నగర్‌లో కొండా సురేఖ, కొండా మురళీ దంపతులు సోమవారం తమ అనుచరులతో సమావేశమయ్యారు.
దీంతో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి.. బయటకు రావాలని కార్యకర్తలకు వారికి సూచించారు. అయితే, ఈ నెల 23వ తేదీ వరకు వేచి చూద్దామని, అప్పటికీ టీఆర్‌ఎస్ అధినాయకత్వం నుంచి స్పందన రాకపోతే, తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కొండా దంపతులు తమ అనుచరులకు స్పష్టం చేశారు.