కొండా సురేఖ కాంగ్రెస్ లో చేరిక ??
కొండా సురేఖ అటు వరంగల్ లో ఇటు తెలంగాణ లో పరిచయం అవసరం లేని నాయకులు, ప్రస్తుత T.R.S వరంగల్ తూర్పు M.L.A. అయితే ఇప్పుడు తెరాస ప్రకటించిన జాబితాలో పేరు లేకపోవడంతో ఇప్పుడు అందరి ద్రుస్తి కొండా దంపతులపై పడింది ,
T.R.S పార్టీని వీడి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతో కొంత నిజo లేకపోలేదు,
ఎందుకంటే
గతంలో జిల్లాలో వేరు వేరు పార్టీ లో వుండి పోటి పడిన కొండా, కడియం, ఎర్రబెల్లి ఇప్పుడు T.R.S గూటికి చేరుకున్నారు, దీంతో సీట్ల విషయం లో కొట్లాట మొదలు అయింది. 2019 లో వరంగల్ తూర్పు M.L.A టికెట్ ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు ఆశిస్తున్నారు, మరో వైపు కాంగ్రెస్ నుండి T.R.S లో చేరిన మాజీ మంత్రి బస్వరాజు సార్రయ్య , వరంగల్ మేయర్, కూడా ఇదే సీటు ఫై ఆశ పెట్టుకున్నారు.
ఇది అల వుంటే తమ సొంత నియోజకవర్గం పాలకుర్తి నుండి పోటి చేద్దాం అనుకుంటే ఆ స్థానాన్ని విడిచిపెట్టడానికి ఎర్రబెల్లికి టికెట్ ప్రకటించారు , అయితే కొందరు కాంగ్రెస్ నేతలు కొండా దంపతులు మా పార్టీ లో చేరుతారని బహిరంగంగానే చెప్తున్నారు, అదే కాకుండా కూతురు ని రాజకీయాల లోకి దింపాలని కొండా దంపతులు అనుకున్నారు .
అయితే వరంగల్ జిల్లా T.R.S పార్టీ లో ఈ ఒక్క సెగ్మెంటే ప్రకటించక పోవడం మరియు కూతురుకి వస్తది అనుకున్న సీటు మధుసూధనా చారీ కి ప్రకటించడం దీనితో, కొండా దంపతులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని అటు నియోజకవర్గం లో ఇటు ప్రచార మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
• ఐతే కొండా సురేఖ మురళి వరంగల్ తూర్పు మరియు తన కూతురు సుస్మిత పటేల్ ని జిల్లాలో ఎక్కడనుంచిఐన స్వతంత్రగా, గెలిచే సత్తా ఉంది అని చెప్పుకోవచ్చు ..
• రాజకీయాలలో ఏది అప్పుడైనా జరగవచ్చు , కొండా దంపతులకు తెరాస టికెట్ కాయం ఐతేకాని , లేక కొండా దంపతులు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేవరకు ఈ ఊహాగానాలు రాష్ట్రంలో గానీ వరంగల్ జిల్లాలో ఊహాగానాలు ఆగేలా లేవు ..