సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశంలోని చాలా మంది తమ బిజినెస్ ను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుడ్ బిజినెస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో లక్షల్లో సంపాదన పొందుతున్నారు. ఈ కోవకు చెందిందే హైదరాబాద్ కుమారి ఆంటీ జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రాంతంలో సాఫ్ట్ వేర్ కంపెనీల మధ్య రోడ్డు పక్కన ఫుడ్ సెంటర్‌ను పెట్టుకుని ఈమే జీవనం సాగిస్తున్నారు. తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఫుడ్ ను రుచికరంగా అందించడం ఇమే విషేశం. దీంతో కుమారి అంటీ గత నెల రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు కూడా ఆంటీ దగ్గర భోజనం రుచి చూశారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనర్కర్లేదు. అయితే ఈ క్రేజ్ కాస్త ఆమె బిజినెస్‌ను భారీగా పెచింది. దీంతో ఆమె వద్దకు నగరం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భోజనం కోసం ఎగబడుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో ట్రాఫిక్ అధికారులు సీరియస్ అయ్యారు. కుమారి అంటీ ఫుడ్ సెంటర్ కు పర్మిషన్ లేదనే కారణంగా ఆమె ఫుడ్ సెంటర్‌ను అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించినట్లు తెలస్తుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె వద్దకు వెళ్లి పర్మిషన్ లేనందు ఫుడ్ సెంటర్ ను తొలగిస్తున్నాము. మా డ్యూటీ మేము చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు కుమారి అంటీకి తెలిపినట్లు తెలుస్తుంది..