కొడుకు ప్రేమవివాహం చేసుకుంటున్నాడని ఓ తండ్రి నీచానికి ఒడిగట్టాడు. అండగా ఉండాల్నిన తండ్రే కొడుకు ప్రేమ వివామం నచ్చని తండ్రి అతని ప్రియురాలిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణంలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సభ్యసమాజం తలదించుకొనే ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Advertisement

వివరాలు: నాగపట్నం జిల్లాలో బంగారం వ్యాపారి నిత్యానందం. అతని కుమారుడు ముకేశ్‌ కన్నన్‌. తను చదివే కాలేజీలో సహ విద్యార్థిని అయిన ఒక అమ్మాయిని కన్నన్‌ ప్రేమించాడు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరు త్వరలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని కొడుకు, తండ్రి నిత్యానందానికి చెప్పాడు. అయితే కొడుకు ప్రేమవివాహాం చేసుకోవడం తండ్రికి నచ్చలేదు. వివాహం జరిపించకపోతే కొడుకు చచ్చిపోతానన్నాడు. దీంతో ఆ తండ్రి ప్రేమికులిద్దరినీ విడదీయడానికి తన దగ్గరి బంధువుతో కలిసి నీచమైన పథకం వేశారు.

దగ్గర బంధువైన శక్తివేల్ అతని భార్య, మరో ముగ్గురు కలిసి పెళ్లి చేస్తానంటూ సదరు యువతి ఇంటికి వెళ్లారు. మాయమాటలతో బాధితురాలిని నమ్మించి శక్తివేల్ ఇంటికి తీసుకెళ్లి బంధించారు. బలవంతంగా తాళికట్టి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే ఈ దారుణంపై నిత్యానందం కారు డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. డ్రైవర్ సమాచారంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, నిత్యానందంపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.