కొడుకే కామంతో కాటేస్తే ! ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి సభ్యసమాజం తలదించుకునేలా రోజుకో సంఘటన బయటకొస్తుంది. మనం నాగరిక సమాజంలో ఉన్నామా. ఆటవిక సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. నిన్న తండ్రే కూతుర్ని గర్బవతిని చేశాడు. నేడు తల్లి వరసయ్యే పిన్నిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలంలో జరిగింది. శివ అనే వ్యక్తి తన పిన్నిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన శివ తన ఆమె దారుణానికి ఒడిగట్టాడు. అయితే అతని భారీ నుంచి తప్పించుకున్న బాధితురాలు కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న శివకోసం గాలిస్తున్నారు.

కాగా శివ గతంలోనూ ఇలాగే ఓ యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా వార్నింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు ఈ క్రమంలోనే ఈ సారి తన సొంత పిన్నిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు….