ఈ మధ్య కాలంలో హనీట్రాప్‌ బాగా ఎక్కువైంది. ఒకప్పుడు కొన్ని సెక్టార మగాళ్లకు మాత్రమే పరిమితమైన ఈ మోసం ఇప్పుడు అంచెలంచెలుగా పాకుకుంటూ వచ్చేసింది. అమ్మాయిల వీక్ నెస్ ఉన్న వ్యక్తులు ఈజీగా ఈ మోసాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణం కూడా హనీ ట్రాప్‌ అని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ పారిశ్రామికవేత్త హనీట్రాప్‌లో పడ్డాడు. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఆ మహిళ యువ పారిశ్రామికవేత్తకు పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ తరచూ చాటింగ్‌ చేసుకునేవారు. తన భర్త దుబాయ్‌లో ఉంటున్నారని, తాను లైంగిక తృప్తి కోసం సరైన భాగస్వామి కోసం చూస్తున్నానని అతనికి చెప్పింది. తన వద్దకు వచ్చి కోరిక తీర్చుకోవాలని అడ్రస్, లొకేషన్‌ పెట్టింది.

Advertisement

ఇక దీంతో సొల్లు కార్చుకున్న ఆ యవకుడు దొరికిందే ఛాన్సు అని వెంటనే వెళ్లిపోయాడు. ఆహ్వానించడమే తరువాయి అన్నట్లు సదరు మహిళ ఇంట్లో దిగిపోయాడు. ఇద్దరూ బాగా అంటే బాగా దగ్గరయ్యారు. కొన్ని రోజులు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక ఈ క్రమంలో ఒకరోజు ఇద్దరూ ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడకు వచ్చారు.యువ పారిశ్రామిక వేత్తను బెదిరించారు. నువ్వు సున్తీ చేయించుకోవాలని సదరు మహిళను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. తమ మాట వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు. ఎలాగో ఒకలా ఆ నలుగురి నుంచి తప్పించుకు వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. హానీట్రాప్‌ ఇప్పుడు వ్యాపారవేత్తలు, సంపన్నులకు కూడా విస్తరించింది. జాగ్రత్త మరి. కక్కుర్తి పడి ఇలా పోయారంటే అంతే సంగతులు. ఐదు నిమిషాల ఆనందానికి చెల్లించుకోవాలి భారీ మూల్యం.