భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు గడల శ్రీనివాపరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కొత్తగూడెం శ్రీనగర్‌ కాలనీ డీఎస్‌ఆర్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఓ సినిమా పాటకు డ్యాన్స్‌ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పులేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ సంసృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు డ్యాన్సు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీనివాసరావు డ్యాన్స్‌ వ్యవమారం తాజాగా చర్చనీయంశంగా మారింది. కాగా హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్రపూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది.