ఇష్టం లేని పెళ్లిళ్లు చాలా దారుణాలకు దారి-తీస్తున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, విడాకులు వంటి ఎన్నో సమస్యలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. తల్లిదండ్రుల పట్టుదలకు తలొగ్గి కొందరు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి కూడా తనకు ఇష్టం లేకపోయినా పెద్దాళ్లు బాధపడతారని పెళ్లికి ఒప్పుకుంది. కానీ తీరా తాళి కట్టించుకోబోయే ముందు ఆమె మనసు ఎదురు తిరిగింది. అంతే, పేళ్ళి పీటల నుంచి లేచి వెళ్లిపోయింది. తెలంగాణ మన మహబూబాబాద్ జిల్లా కేద్రంలో ఈ సంఘటన జరిగింది.

Advertisement

మహబూబాబాద్‌కు చెందిన యువకుడికి ఖమ్మంకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరగబోయింది. పంతులు మంత్రాలు చదువుతూ తంతు పూర్తి చేస్తున్నారు. వధూవరులు జీలకర్ర – బెల్లం పెట్టుకున్నారు. కొన్ని క్షణాల్లో వరుడు తాళి కట్టబోతాడనగా || వధువు టపీమని పైకి లేచింది. పెళ్లికొడుకును తోసేసి ‘నాకీ పెళ్లి వద్దు.’ అని చక్కాగా వెళ్లిపోయింది. దీంతో పెళ్లికి వచ్చిన వారు షాక్ తిన్నారు. విషయం పోలీసులకు చేరింది. వారు జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోవపోడంతో పెళ్లికి ఆటంకం కార్డు పడింది.