కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కన్నతల్లి మృతిచెందిన విషయాన్ని గోప్యంగా ఉంచి యువతి వివాహాన్ని జరిపించారు. జిల్లాలోని అశ్వాపురం మండలంలోని బుడుగు బజారుకు చెందిన కటుకూరి నాగేంద్ర(48) కుమార్తె ప్రవీణకు మొండికుంటకు చెందిన యువకునితో గురువారం తెల్లవారుజామున వివాహం జరగాలి. వధువు, బంధువులు బుధవారం రాత్రి 11.30 గంటలకు కార్లలో అశ్వాపురం నుంచి బయల్దేరారు. వీరు ప్రయాణించే కార్లు ముందుగానే చేరుకోగా.. వధువు తల్లి కటుకూరి నాగేంద్ర, బంధువులు ప్రయాణిస్తున్న కారు చింతిర్యాల అడ్డరోడ్డు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో వధువు తల్లి నాగేంద్రకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆమెను హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందింది. తల్లి మరణవార్త తెలియకుండా జాగ్రత్త పడిన బంధువులు ప్రవీణ వివాహాన్ని జరిపించారు. అనంతరం జరిగిన విషాదం గురించి తెలుసుకుని కన్నీటి పర్యంతమైంది.