లాటరీ పేరుతో కోటికి టోకరా వేసిన నైజీరియన్ సైబర్ నేరస్థుడుని డీల్లీలో అరెస్టు. నేరస్థులు ఎక్కడున్న వదలం
కోకాకోలా లాటరీ వచ్చిందంటూ కోటి రూపాయలు యువకులకు టోకరా వేస్తున్న నైజీరయన్ సైబర్ మోసగాడితో పాటు నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన యువతిని బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ పోలీసుల సహకారంతో శాయంపేట పోలీసులు డీల్లీలో అరెస్టు చేసారు.
అరెస్టు చేసిన ఇద్దరి నిందితుల నుండి 2లక్షల 3వేల రూపాయల నగదుతో మరియు రెండు ల్యాప్‌టాప్‌లు, 23 సెల్‌ఫోన్లు, విదేశీ పాస్‌పోర్ట్ లను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ ఆయి వున్న 28లక్షల రూపాయలకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేత చేయడం జరిగింది.
అరెస్టు చేసిన నిందితుల వివరాలు
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ.
- శాయంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన సిరిపురం మహేందర్‌కు ఏప్రిల్ 2017 సంవత్సరంలో తన సెల్‌ఫోన్‌కు మీకు కోకాకోలా ఆన్‌లైన్ లాటరీ వచ్చింది. దాని విలువ 5,00,000 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్( ఇండియన్ కరేన్సీ ప్రకారం 4కోట్ల 45లక్షలు ) ఉంటుందని. దీనికి సంబంధించి మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్‌తో పాటు బ్యాంక్ ఖాతాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ క్రింది ఇ-మెయిల్‌కు సమాచారం పంపాలనే సారాంశంతో కూడిన సంక్షిప్త సమాచారంతో ఒక ఎస్.ఎం.ఎస్ వచ్చింది.
- సదరు భాధితుడు వెంటనే తన పూర్తి వివరాలను నిందితులు తెలిపిన ఈ-మెయిల్‌కు ప్రత్యూత్తరాలు జరిపాడు. దీనితో భాదితుడు మహేందర్‌కు నిందితులు లాటరీ వ్యవహరాలను చూసుకోవడానికి ఢిల్లీకి మాథ్యూస్ వచ్చి మీకు ఫోన్ చేస్తాడని. ముందుగా రిజిస్ట్రేన్ ఛార్జీల క్రింద 200 పౌండ్లను (1లక్ష 80వేలు) చెల్లించాల్సి వుంటుందని. మీ లాటరీ డబ్బు త్వరలోనే వస్తుందని నమ్మించారు.
- దీనితో బాధితుడు వారు అడిగినట్లుగానే వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమచేసాడు. వచ్చిన డబ్బును తీసుకోవాలంటే ఇమిగ్రేషన్, కస్టమ్స్ టాక్స్, మనీల్యాండరీంగ్ టాక్స్ మరితయు యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికేట్, ఆర్‌బీఐ క్లియరేన్స్ సర్టిఫికెట్ తదితర ధ్రువపత్రాలను అందజేయాలని అందుకు కోంత డబ్బును డిపాజిట్ చేయాలని నిందితులు మాథ్యూస్ పేరుతో పలు దఫాలు ఫోన్ మరియు ఈ-మెయిల్ ద్వారా సూచించడంతో పాటు, పోలీస్ క్లియరేన్స్ గురించి డబ్బు డిపాజిట్ చేయాల్సి వుంటుందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ పేరుతో తయారు చేసిన నకిలీ డాక్యూమెంట్‌ను పంపించడంతో, బాధితుడు నిందితులకు సంబంధించిన ఎస్.బి.ఐకి బ్యాంకు చెందిన 12 ఖాతాల్లో 10 లక్షల రూపాయలను డిపాజిట్ చేసాడు.
- బాధితుడికి పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసిన తనకు వచ్చిన లాటరీ మొత్తం డబ్బు రాకపోవడంతో పాటు, వీరి వ్యవహరంపై బాధితుడికి అనుమానం రావడంతో శాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. ఇదే తరహలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కరికే భరత్‌కుమార్ అనే యువకుడు నిందితులకు సంబంధించి వివిధ వాణిజ్య బ్యాంకులకు చెందిన 24 బ్యాంక్ ఖాతాల్లో 71 లక్షల రూపాయలను డిపాజిట్ చేసి మోసపోయిన సంఘటనలో బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రెండు సంఘటనలపై అప్రమత్తమయిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కోకాకోలా లాటరీ మోసాలు ఢీల్లీ నుండి జరిగినట్లుగా నిర్థారించారు.
- నిందితులు గుర్తించి పట్టుకోనేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశాల మేరకు పర్కాల ఏ.సి.పి వై.వి.ఎస్. సుధీంద్ర పర్యవేక్షణలో శాయంపేట ఇన్స్‌స్పెక్టర్ సాదుల్లాబాబా నేతృత్వంలో రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ముందుగా సైబర్ విభాగం సహకారంతో నిందితులు వినియోగించిన సెల్‌ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్, బ్యాంక్ ఖాతాలను అధారంగా చేసుకోని.
- గత కోన్ని రోజులగా దర్యాపు జరిపి నిందితుల కోసం ఈ బృందాలు ఢిల్లీకి తరలి వెళ్ళారు. నిందితులను గుర్తించేందుకుగాను ఈ దర్యాప్తు బృందాలు ముందుగా నిందితులు వినియోగించిన ఇంటర్‌నెట్ వివరాలను వినియోగించుకోని ప్రదేశాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక ఢిల్లీ కోర్టు అనుమతితో దర్యాప్తు బృందాలు నిందితులను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు
అరెస్టు చేసిన నిందితులను పోలీసులు విచారించగా నిందితులలో ఒకడైనా నైజీరియా దేశస్థుడు సైబర్ చీటర్ డిమ్యూయేన్ ఉచైన్‌్ 2015 సంవత్సరంలో మనదేశంలోకి వచ్చాడు. ఇదే సమయంలో చిరు వ్యాపారం నిర్వహించుకోనేందుకు ఢిల్లీకి వచ్చిన మరో నిందితురాలు హీనియాకు డిమ్యూయేన్ ఉచైన్‌్‌తో పరిచయం కావడంతో పాటు, వారి మధ్య స్నేహం కుదిరింది. దీనితో ఇద్దరు నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన కోకాకోలా లాటరీ మోసానికి సంబంధించి ప్రణాళికను రూపోందించుకున్నారు.
ఇందుకు గాను నిందితులిద్దరూ వివిధ మార్గాల ద్వారా సెల్‌ఫోన్ నెంబర్ల సేకరించడంతో పాటు డబ్బు లావాదేవీలు జరగని బ్యాంక్ ఖాతాలను గుర్తించి. కోకాకోలా లాటరీ పేరుతో సేకరించిన సెల్‌ఫోన్ నంబర్లకు కోకాకోలా ఆన్‌లైన్ లాటరీ వచ్చిందనే ఎస్.ఎం.ఎస్ పంపి, పంపిన వాటిలో స్పందించిన బాధితులను నమ్మించడంతో పాటు నకీలీ ధ్రువప్రతాలను చూపించేవారు.
నిందితులు ఇప్పటివరకు సుమారు 6కేసుల్లో సుమారు కోటి రూపాయల వరకు డబ్బును యువకులను మోసం చేసి తమ ఖాతాలకు డిపాజిట్ చేయించుకున్నారు. ఇందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ శాయంపేట్, బచ్చన్నపేట్ తో పాటు హైదారాబాద్, రాచకోండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మోసాలకు పాల్పడినట్లుగా నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు.
కోకాకోలా లాటరీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను చాకిచక్యంతో అరెస్టు చేయడంతో పాటు, డబ్బును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ కమిషనర్ అభినందించారు.