యువతి తిట్ల పురాణంతో క్యాబ్ డ్రైవర్ బెంబేలెత్తిపోయాడు. బాబోయ్.. ఈ తిట్లేంటిరా నాయనోయ్ అంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే, బంజారాహిల్స్‌లో ఓ సిగ్నల్ దగ్గర ఓ యువతి బైక్‌ను వెనక నుంచి వచ్చిన క్యాబ్ ఢీకొట్టింది. కోపంతో క్యాబ్ డ్రైవర్‌పై యువతి చేయిచేసుకుంది. అంతటితో ఆగకుండా అతడిపై బూతులతో విరుచుకుపడింది. ఎందుకు కొడతావ్ అని అతను ప్రశ్నిస్తే.. బరాబర్ కొడతాం అంటూ డ్రైవర్‌పై చిందులేసింది. యువతి తిట్లు దగ్గరలోని కెమెరాలో రికార్డయ్యాయి. తనపై చెయిచేసుకుని, బూతులు తిట్టిందని క్యాబ్ డ్రైవర్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.