శివాజీనగర: బెంగళూరులో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)లో క్రీడాకారిణి ఒకరు స్నానం చేస్తుండగా మరో క్రీడాకారిణి వీడియో తీయడం వివాదాస్పదమైంది. తైక్వాండో క్రీడాకారిణి ఒకరు స్నానానికి వెళ్లగా మరో వాలీబాల్‌ క్రీడాకారిణి ఆమెను మొబైల్‌లో వీడియో తీసింది. ఇది చూసి బాధిత యువతి గొడవపడి మొబైల్‌ను పగలగొట్టింది. ఆపై జ్ఞానభారతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మొబైల్‌లో చిత్రీకరించిన యువతిపై వివిధ సెక్షన్లు, ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు మొబైల్‌ను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు.