క్రీడాకారుల్లో పోటీతత్వం పెరగాలని , అప్పుడే వారు జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు . మండలం లోని మేడారంలో శుక్రవారం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రీమియర్ లీగ్ సీనియర్ , జూనియర్ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించినారు . అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉండే కబడ్డీకి జాతీయస్థాయి గుర్తింపు వచ్చిందంటే అదంతా ఆడేవారి కృషి మాత్రమే అని చెప్పారు .

యువకులు కబడ్డీలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురా వాలని కోరారు. అనంతరం కబడ్డీ క్రీడల జెండాను విడుదల చేశారు. సరదాగా కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరి చారు . అనంతరం విశిష్ట అతిథి ఉమ్మడి వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేసన్ కార్యదర్శి తోట సురేశ్ మాట్లాడుతూ మేడారం లాంటి మారుమూల గ్రామాల క్రీడాకారులకు సైతం అవకాశాలు రావాలనే ఉద్యేశంతోనే ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహిస్తన్నట్లు తెలిపారు .

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాఘవేంద్ర రెడ్డి , సీఐ శ్రీనివాస్ , స్థానిక ఎస్సై రవీందర్ , సర్పంచ్ చిడం బాబురావు , కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి , కిసానెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ , పైడాకుల అశోక్ , అనంత రెడ్డి , సూర్యనారాయణ పాల్గొన్నారు…