ప్రియుడి మ‌త్తులో భ‌ర్త‌కు విడాకులు ఇచ్చింది. ఆ త‌ర‌వాత ప్రియుడితో క‌లిసి ఉండ‌గా త‌మ్ముడు అడ్డు వ‌చ్చాడు. దాంతో ప్రియుడి కోసం త‌మ్ముడినే లేపేసింది. కానీ చివ‌రికి చ‌ట్టం త‌న‌ప‌నితాను చేయ‌డంతో క‌ట‌క‌టాల పాల‌య్యింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే: క‌ర్నాట‌క రాష్ట్రం బ‌న‌శంక‌రి న‌గ‌రానికి చెందిన భాగ్య శ్రీకి గ‌తంలో పెళ్ల‌య్యింది. కానీ పెళ్లికి ముందే భాగ్య‌శ్రీకి సుపుత్ర శంక‌ర‌ప్ప‌తో ప‌రిచ‌యం ఉంది. కాగా పెళ్లైన కొన్నేళ్లకు భాగ్య‌శ్రీ భ‌ర్తకు విడాకులు ఇచ్చింది. ఆ త‌ర‌వాత ప్రియుడు సుపుత్ర‌తో స‌హ‌జీవ‌నం మొద‌లుపెట్టింది. అయితే ఈ విష‌యం తెలిసిన భాగ్య శ్రీ త‌మ్ముడు ఆమెను మంద‌లించాడు.

కానీ భాగ్య శ్రీ ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పురాలేదు. అంతే కాకుండా త‌మ్మ‌డు అడ్డువ‌స్తున్నాడ‌ని ప్రియుడితో క‌లిసి అత‌డిని అడ్డుతొల‌గించుకుంది. సొంత ‌త‌మ్ముడినే 2015లో ప్రియుడితో క‌లిసి ముక్క‌లు ముక్కలుగా చేసి అనుమానం రాకుండా ప‌లు ప్రాంతాల్లో ప‌డేసింది. ఇక ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ మ‌హ‌రాష్ట్ర‌లోని నాసిక్ కు మ‌కాం మార్చారు. అక్క‌డ పేర్లు మార్చుకుని జీవనం సాగించారు. కాగా ఈ కేసులో విచార‌ణ జ‌రిపిన పోలీసులు ఎనిమిదేళ్ల‌కు నింధితుల‌ను నాసిక్ లో ప‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం భాగ్య‌శ్రీ ప్రియుడితో క‌లిసి జైలులో ఊస‌లు లెక్క‌పెడుతోంది.