గండ్ర సత్యనారయణరావు తాను కూడా టీఆర్‌ఎస్ పార్టీ వ్యక్తినేనని చెప్పుకోవడం సిగ్గుచేటని TRS మండల పార్టీ అధ్యక్షుడు కత్తి సంపత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని TRS పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్ల్లీ ఎన్నికలలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఫార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థిగా పోటీచేసి టీఆర్‌ఎస్‌కు ద్రోహం చేసిన గండ్ర ఇప్పుడు తాను కూడా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వాడినని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలను ,తెరాస నాయకులను, కార్యకర్తలను పార్ట్టీపేరుతొ మోసానికి గురిచేస్తున్నడని ఆరోపించారు. ఇప్పటికైనా ఇవి మానుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టిఅర్‌ఎస్ పార్టి మండలప్రధానకార్యదర్శి తిరుపతి, మాజీ జెడ్‌పిటిసి ఓరం సమ్మయ్య, రాంరెడ్డి,బొడ్డు సదానందం,రమేష్, అశోక్,కోటి తదితరులు పాల్గొన్నారు.