{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":["add_photo_directory"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582138023441","total_editor_time":34,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582138023433","total_effects_time":0,"brushes_used":0,"height":750,"layers_used":0,"width":1242,"subsource":"done_button"}

బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి, తమ కూతురి హత్యకు ప్రేమోన్మాదమే కారణమని తల్లిదండ్రులు మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. వెంకటేష్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచే దివ్యను వేధిస్తున్నాడని, ఎల్లారెడ్డిపేట పోలీసులకు కంప్లైంట్ కూడా చేశామని అంటున్నారు. దివ్య స్వస్థలం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాగా 6 నెలల క్రితమే ఉద్యోగంలో చేరింది. ఈనెల 26వ తేదీన ఆమె పెళ్లి జరగాల్సి ఉండగా, తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైపోగా, ఇంతలోనే దారుణం జరిగిపోయింది.

అయితే, పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దివ్య తల్లిదండ్రు ఆరోపణల్లో వస్తవం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే సమయంలో దివ్యను వెంకటేష్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించారని చెబుతున్నారు, ఆ తర్వాత దివ్య-వెంకటేష్ రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. అయితే, లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరు విడిపోయేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై దివ్య జోలికి రానంటూ పోలీసుల సమక్షంలో వెంకటేష్ సంతకం కూడా చేశాడు కానీ, దివ్యకు మళ్లీ పెళ్లి కుదరడంతో వెంకటేష్ కక్ష పెంచుకున్నట్టుగా చెబుతున్నారు. దీంతోనే వెంకటేష్ దివ్యను హత్య చేసినట్టుగా భావిస్తున్నారు, పోలీసుల విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, ప్రాథమికంగా వెంకటేష్ హత్య చేసినట్టుగా భావిస్తున్నామని నిందితుడిని పట్టుకోవడం కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు ACP త్వరలోనే నిందితుడిని పట్టుకుని, విచారణ పూర్తి చేస్తామన్నారు….