స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఈ అమ్మ‌డు కేక పెట్టించే అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంటుంది. ర‌కుల్ సినిమాల్లో చేసే అందాల విందు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అంతకు మించి రెట్టింపు స్థాయిలో గ్లామర్ షో చేస్తోంది. అయితే రియల్ లైఫ్‌లో అడ్వెంచర్స్ చేయడం రకుల్‌కు చాలా ఇష్టం. తాజాగా దీనికి సంబంధించి ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరినీ మంత్ర ముగ్ధుల‌ని చేసింది. ర‌కూల్ ఫీట్స్‌పై నెటిజ‌న్స్ స‌ర్వాత్వా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డ్డ కట్టే మంచులో రకుల్ చేసిన ఈ ఫీట్ చూసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లో రకుల్ ఏకంగా బికినీలో గడ్డ కట్టే నీటిలో ఐస్ బాత్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది బ్లూ బికినీలో రకుల్ చేసిన ఈ సాహసాన్ని ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఇక -15 డిగ్రీల వాతావరణంలో ఇలా చేయాలంట ఎంతో ధైర్యం ఉండాలని ఆమె అభిమానులు చెబుతూ ముక్కున వేలేసుకుంటున్నారు కాగా, రకుల్ చేసిన ఈ సాహసం నిజంగా అభినందనీయం అని పలువురు నెటిజన్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. రకుల్‌ పోస్ట్ చేసిన వీడియోలో మొదట బికినీలో దర్శనమిచ్చింది. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండి, కొంత మేర నీరు ఉన్న ఓ చిన్న కొలనులోకి వెళ్లి పూర్తిగా నీటిలో మునిగింది ర‌కుల్. అనంతరం నీటిలో నుంచి బయటకు వచ్చేసింది. ఇంతకీ అంతటి చలిలో అది కూడా బికినీలో మునక వేయడానికి అసలు కారణం ఏంటంటే ఇది రకుల్‌ ట్రై చేసిన కొత్త థెరపీ. దీనిని క్రియో థెరపీగా పిలుస్తారు దీనిని కణజాల గాయాలకు చికిత్స చేయడానికి క్రియోథెరపీని ఉపయోగిస్తారు. చాలా తక్కువ ఉష్ణోగ్రత నీటిలో స్నానం చేయడం వల్ల కణజాలల గాయలను తగ్గించుకోవచ్చు. మైగ్రేన్‌ లక్షణాలు, గాయాలు మానిన తర్వాత వచ్చే నొప్పి, ఆర్థరైటిస్‌ నొప్పులు, అల్జీమర్స్‌, కొన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఈ థెరపీని సాధార‌ణంగా ఉపయోగిస్తుంటారు. రకుల్‌ పోస్ట్ చేసిన ఈ వీడియోతో నెటిజన్లు క్రియో థెరపీ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.