నెలలు నిండిన ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆసుపత్రికి వస్తే మేల్ నర్స్ దారుణానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని రామ్‌ఘడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది.
ఓ గర్భిణి పురుటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం రామ్ ఘడ్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. పురుడు పోసేందుకు ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న ఓ మేల్ నర్స్ శిశువుని రెండు చేతులతో బలంగా లాగాడు. అంతే చిన్నారి శిశువు రెండు భాగాలుగా విడిపోయి ముక్కలుగా రావడం అందరికి దిగ్భ్రాంతి కలిగించింది. శిశువు కింద భాగం ముక్కలను ఆసుపత్రి మార్చూరీలో ఉంచి, సదరు మహిళను మెరుగైన చికిత్స కోసం జైసల్మేర్లోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యుడు సలహా ఇచ్చాడు.
మహిళ కడుపులో శిశువు తల ఉండిపోవడంతో డాక్టర్ రవీంద్ర శంఖ్లా ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఆమెకు శస్త్రచికిత్స చేసి తలను బయటకు తీశారు. ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మేల్ నర్సు శిశువును ముక్కలుగా చేసి బయటకు తీసిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది..