గుండెపోటుతో మరణించిన 18 సంవత్సరాల విద్యార్థిని

సంగేం మండలంలోని లోహిత గ్రామానికి చెందిన నునావత్ రమాదేవి అర్ధరాత్రి గుండెపోటుతో మరణించింది. యువతి వయసు 18 సంవత్సరాలు కావడం గమనార్హం. ఈమె భీమారం లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతుంది. కాగా సోమవారం అర్ధరాత్రి తన స్నేహితులతో నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొంది. సంబరాలు ముగిశాక ఆమె తన గదికి వెళ్లి నిద్రించింది.

అయితే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుండె నొప్పి రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా 18 ఏళ్లకే గుండెపోటుతో మరణించడం ఒకింత కలవరానికి గురి చేస్తుంది.