గుండెపోటు నాటకంతో ఎర్రబెల్లి గెలిచారు: కొండా సురేఖ

బంగారు తెలంగాణ కేసీఆర్‌ కుటుంబానికే పరిమితమైందని మాజీ మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చామన్న టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఓసారి అధికారం ఇచ్చారని ఆమె అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ అవసరం లేదని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. 2014లో గుండెపోటు నాటకంతో ఎర్రబెల్లి గెలిచారని విమర్శించారు. ఎర్రబెల్లికి నిజంగా గుండెపోటు వచ్చేలా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని కొండా సురేఖ జోస్యం చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ పెరుగుతున్నదని రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జిల్లా లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామన్నారు.