దశాబ్దం పైగానే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలింది ఇలియానా . తెలుగు తమిళంలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించిన , ఈ గోవా బ్యూటీ అటు పై బాలీవుడ్ కి జంప్ చేసిన సంగతి తెలిసిందే . అక్కడ పేకాట సరిగా కుదరలేదు . ఒక హిట్టు నాలుగు ప్లాప్ ల చందంగా కెరీర్ తిరోగమనంలో వెళ్లడంతో తిరిగి ప్లేటు ఫిరాయించింది . ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో మాస్ రాజా సరసన టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది .

అయితే బిగ్ ఫ్లాప్ తో పునరాగమనం మరోసారి ఇలియానా ఆశలపై నీళ్లు చల్లింది . టాలీవుడ్ రీఎంట్రీ ఘనంగా ఉండాలన్న ఆశ అడియాశే అయ్యింది . దీంతో తిరిగి సౌత్లో ఛాన్సులు కరువవవంతో బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి సారించాల్సిన సన్నివేశం నెలకొంది . మునుముందు టాలీవుడ్లో ఇలియానాకి ఛాన్స్ ఉంటుందా . . లేదా ? అన్నది ఇప్పుడే చెప్పలేం అయితే సినిమాల్లేకపోయినా . . ఈ బ్యూటీ రకరకాల అసైన్ మెంట్స్ తో నిరంతరం బిజీగా ఉంటుందన్న సంగతి తెలిసిందే . ఇప్పటికే ఫిజీ దీవులకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తోంది . వీలున్నప్పుడల్లా సంచరిస్తూ బికినీ ఫోటోషూట్లతో హీటెక్కిస్తోంది . ప్రియుడు ఆండ్రూ నీబోన్ ఫోటోగ్రఫీ పనితనం కుర్రకారును వెర్రెత్తిస్తోంది . ఇదిగో ఈ సిరీస్ లోనే ఓ కొత్త ఫోటోషూట్ తాజాగా వెబ్ ని వేడెకిస్తోంది . ఇలియానా రెడ్ హాట్ బికినీలో గుండె జిల్లనిపిస్తోంది . ఇలియానా అలా మోడ్రన్లుక్ ఫెంటాస్టిక్ అంటూ కుర్రకారు మైమరిచిపోతున్నారు . టాప్ లో రెడ్ పీస్ , జీన్స్, వైట్ షర్ట్ కవరింగ్ . రేబాన్ కళ్లద్దం . అబ్బబ్బో అంటూ ఇదైపోతున్నారంతే ! ! ఇంతకీ ఆ చెవిలో పుష్పం ఎందుకో ?