‌కలుషిత ఆహారం తిన్న 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (వెలుగు)లో సోమ వారం జరిగింది. వసతి గృహంలో ఉదయం విద్యార్థిను లకు అల్పాహారంగా కిచిడీ పెట్టారు. అనంతరం 20 మంది విద్యార్థినులు కడుపు నొప్పి, విరేచ నాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 16 మందికి వసతి గహంలోనే ప్రథమ చికిత్స అం దించారు. ప్రళయ (10వ తరగతి), స్రవంతి (5వ తరగతి), అంజలి (7వ తరగతి ), ఛాయా దేవి (5వతరగతి) ని మండల కేంద్రంలోని ప్రభు త్వ సామాజిక వైద్యశాలకు తరలించి చికిత్స అం దించారు. ప్రళయకి కడుపు నొప్పి ఎక్కువ కావ డంతో పరకాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆహారం కలుషితం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్టు వైద్యులు భావిస్తున్నారు.