గుర్తు తెలియని యువతిని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. దేవరాంజిల్‌లో ఓ యువతి రక్తపు మడుగులో పడిఉండగా స్థానికులు గమనించి పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమీపంలో బండరాయి లభించింది. ఆమె ఎడమ చేయిపై శివ అని రాసి ఉంది. మృతురాలి వయసు 26 సంవత్సరాలు ఉంటుందని, పోలీసులు సాయంత్రం హత్య జరిగినట్లు భావిస్తున్నారు .

మహిళతో కలిసి అక్క డికి వచ్చిన నిందితులు సదరు మహిళతో మద్యం సేవించినట్లు తెలుస్తున్నది . మద్యం మత్తులో తోపులాట జరిగి మహిళ తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు . మాయ మాటలతో తీసుకొచ్చి హత్య చేశారా . . ? లేక సరదాగా తీసుకొచ్చి మద్యం సేవించిన అనంతరం ఆమె నుంచి తప్పించుకునేందుకు హత్య చేశారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . అలాగే మహిళపై లైంగికదాడి జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తు న్నారు . సంఘటన స్థలంలో మద్యం బాటిళ్లతో పాటు బండరాళ్లు ఉన్నాయి . క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు . గుర్తు తెలియని మృతదేహంగా కేసునమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు .

ఇదిలా ఉండగా . .

మృతురాలి చేతిపై శివ అనే టాటూ ఉంది . అదే విధంగా పసుపు పచ్చ పంజాబీ డ్రెస్ , నల్ల చుక్కల చున్నీ ఉంది . మృతురాలి బంధువులు ఎవరైనా ఉంటే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు . హత్య ఎందుకు చేశారు, ఆమె ఎవరనే విషయాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.