హనుమకొండ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అనంతరం మేమే గెలుస్తాం అని ఎవరి ధీమా వ్యక్తం చేసుకుంటున్నారు. వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు తమ కార్యకర్తలతో నాయకులతో కలిసి సీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈనెల 11న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.అయినా కానీ నగరంలో ఎప్పటినుంచే ఆనందోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. శుక్రవారం సాయంత్రం పోలింగ్ కగానే వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవి చంద్ర ,కొండా సురేఖ తో కలిసి దేశాయిపేట లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచుకుంటున్న విషయం తెలిసిందే , పోటాపోటీగా తూర్పు టిఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ అనుచరులు వరంగల్ చౌరస్తాలో గెలుపు మాదే అంటూ స్వీట్లు పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

ఇదిలా ఉండగా నగరంలో ఎటు చూసినా అభ్యర్థుల గెలుపుపై ప్రజలు చర్చించుకుంటున్నారు. మహిళలు, యువకులు తమ అభ్యర్థిని గెలవాలని దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఉపశమనం కోసం ప్రత్యేక క్షేత్రాలను దర్శించుకునేందుకు విహారయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. నియోజకవర్గంలోని బూత్ల వారీగా పోలింగ్ ఎంత శాతం నమోదయింది. వారు ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. వచ్చిన సమాచారాన్ని బట్టి తమకు అనుకూలంగా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో బేరీజు వేసుకుంటూ బూత్ల వారీగా మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయి. వారి సొంత అంచనాకు వస్తున్నారు. అభ్యర్థులు కుటుంబ సభ్యులతో బంధువులతో కాలక్షేపం చేస్తున్నారు.

ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులను పోలీస్ అధికారులను గెలుపు ఓటముల పై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. గెలుస్తున్నాం అనే ధీమాతో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ విజయ సంగీతాన్ని ప్రజలకు అందిస్తున్నారు. ఏది ఏమైనా ఈ నెల 11న ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి అభ్యర్థుల కవిత్వం ఉండబోతుంది.