“గెస్ట్ హౌస్‌కు వచ్చెయ్ అనే వాళ్లు “

ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో సినీ రంగంలో తన అనుభవాల గురించి వివరించింది ఈ నటి. కాస్టింగ్ కౌచ్ ఆ రోజుల్లో కూడా ఇది ఉందని ఆమని వ్యాఖ్యానించింది. తను కూడా అలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నాను అని వివరించింది.

సినిమా చేసే ఆసక్తి ఉందని కొంతమంది సంప్రదించే వాళ్లని, అంతా ఓకే అన్నాకా. గెస్ట్ హౌస్‌కు వచ్చెయ్.. అనే వాళ్లని ఆమని చెప్పింది. ‘గెస్ట్ హౌస్’ అనడంతోనే అనుమానాలు మొదలయ్యేవని ఆమె అన్నారు. అందులో కూడా ‘మీ అమ్మను వెంట తీసుకురాకు.. ’అనే వాళ్లని..దీంతో మొత్తం వ్యవహారం అర్థమయ్యేదని ఆమని వివరించింది.

దీంతో అలాంటి వారికి దూరంగా ఉండేదాన్నని చెప్పింది. పెద్ద నిర్మాణ సంస్థల్లో అలాంటి వ్యవహారాలు ఉండేవి కావని, చిన్న కంపెనీల నుంచి మాత్రమే అలాంటి ప్రతిపాదనలు వచ్చేవని ఆమని వివరించింది.