ప్రమాదంలో పదిమంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు.వీరంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు.
Advertisement
ఏపి నుంచి శబరిమలకు వెల్తుండగా తమిళనాడులో నిపుదుకోట్టై వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయ్యప్ప భక్తులు శబరిమల నుంచి తిరిగి సొంత ఊరికి వెళ్తుండగా, రామేశ్వరం-తిరుచ్చి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. కంటైనర్ రాంగ్ రూట్‌లో ఒక్కసారిగా రోడ్డుపై రావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదం గురించి తెలియగానే తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ క్షతగాత్రులు చికిత్సపొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితుల్ని పరామర్శించి , మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.