ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేకత ఉంది అందుకే మన వారు ఏ దేశానికి వెళ్లినా ప్రాధాన్యం లభిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు. వీటిని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరముందని చెబుతున్నారు గొర్రెకుంట హైస్కూల్ పూర్వ విద్యార్థి, ప్రస్తుత NPDCL సివిల్ ఏఈ ముక్కెర రాజశేఖర్ గారు..
పాఠశాలకు బెంచీల బహూకరణ గీసుగొండ
గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ గొర్రెకుంట హైస్కూల్ కు 1986 – 87 సంవత్సరంలో అదే పాఠశాలలో 7వ తరగతి బ్యాచ్ విద్యార్థులు 20 బెంచీలను మంగళవారం బహూకరించారు . ఈ సందర్భంగా హెచ్ ఎం అనిత మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలపై మమకారంతో పాఠశాల అభివృద్ధికి చేయూతనందించడం అభినందనీయమన్నారు . ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ముక్కెర రాజశేఖర్, క్లెమెంట్ , సంజీవ , రాము , భిక్షపతి , స్వామి , రాజు , విజయ్ , శ్రీను , కనకయ్య , కనకలక్ష్మి , శ్రీమాత , ప్రమీల , పద్మ , అన్నపూర్ణ , హైమావతి , శాంత , సుగుణ , శోభ , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు .