{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578299173933","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578298540951","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు చిన్న శంకరంపేట గ్రామంలో గల తెలంగాణ మోడల్ స్కూల్ మరియు కాలేజీలో శ్రీ మెలాని ఫోమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన క్రీడా మైదానం యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అధితిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా చిన్న శంకరంపేటలో గల తెలంగాణ మోడల్ స్కూల్ మరియు కాలేజీలో శ్రీ మెలాని ఫోమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన క్రీడా మైదానం యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అధితిగా పాల్గొని క్రీడామైదానంను ప్రారంభించారు, అలాగే అంతర్జాతీయ స్థాయి కబడ్డీ మరియు రబ్గీ పోటీలలో స్థానం పొందిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు రాధేష్ మరియు ప్రకాష్ లకు ప్రశంసాపత్రం మరియు మెడల్ లను బహుకరించారు.

జిల్లా ఎస్.పి. గారు మాట్లాడుతూ: ప్రతి విద్యార్థి చదువుతో పాటుగా వ్యాయామం, క్రీడలపై కూడా శ్రద్ధ చూపాలని క్రీడలతో మనాసిక ఉల్లాసం లభిస్తుందని, క్లిష్టమైన పరిస్థితులలో తట్టుకోగల శక్తి సామార్ద్యాలు పెంపొంధించుకోగలమని, తద్వారా శారీరకంగా మరియు మానసికంగా కూడా ధృడంగా ఉంటామని అన్నారు. అలాగే క్రీడలవల్ల చదువుతో పాటు ఉద్యోగాలలో క్రీడా కోటా కింద రిజర్వేషన్ వుంటుంది కాబట్టి క్రీడా పోటీలలో పాల్గొని ఉద్యోగాలు సాదించి తాము చదువుకున్న కళాశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని విధ్యార్థులకు సూచించారు.

ప్రస్తుతం విధ్యార్థులు ఔట్ డోర్ గేమ్స్ పై శ్రద్ద చూపడం లేదని, సెల్ ఫోన్లో, కంప్యూటర్ లలో తమయొక్క విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని, కాబట్టి విధ్యార్తులు తమకున్న విలువైన సమయాన్ని చదువులపై, క్రీడలపై కేటాయించి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలని అన్నారు, అలాగే ఎల్లపుడూ తమ పరిసరాలను పరిశుబ్రంగా వుంచుకోవాలని, శ్రీ మెలాని ఫోమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విధ్యార్తుల గురించి ఏర్పాటు చేసిన ఈ మైదానంను సంక్రమగా ఉపయోగించుకొని మంచి క్రీడాకారులుగా తయారు అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మెలాని ఫోమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీమతి ఊర్మిళ మిలాని, తెలంగాణ మోడల్ స్కూల్ మరియు కాలేజీ ప్రిన్సిపల్ , సి.ఐ. రామాయంపేట నాగార్జున గౌడ్, శంకరంపేట ఆర్ ఎస్.ఐ. ఏం.డి. గౌస్ గారు మరియు విధ్యార్థులు విధ్యార్తినిలు పాల్గొన్నారు.