చదువు ఇష్టంలేక ఆత్మహత్య

చదువుఇష్టం లేక ఓ పదో తరగతి విద్యార్థి డీజిల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఇటీవల ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలోనే ఈ విద్యార్థి సైతం బలవన్మరణానికి పాల్పడడం జగిత్యాల జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది.
పోలీసుల వివరాల ప్రకారం.

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన దుర్గపు జగదీశ్‌(15) పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. అయితే కొద్దిరోజులుగా చదువు ఇష్టం లేకపోవడంతో దిగాలుగా ఉండేవాడు. గమనించిన తల్లిదండ్రులు సముదాయించి పాఠశాలకు పంపిస్తుండేవారు. ఇటీవల దసరా సెలవులు రావడం, 15రోజులు సంతోషంగా గడిపిన జగదీశ్‌ మళ్లీ పాఠశాలకు వెళ్లి చదువుకోవడాన్ని ఇష్టపడలేదు. దీంతో తనను ఎలాగైనా పాఠశాలకు పంపిస్తారనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని మిషన్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో నిర్మాణుశ్య ప్రాంతంలో బుధవారం డీజిల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

గతనెలలో ఇదే ప్రాంతంలో పదో తరగతి విద్యార్థులు రవితేజ, మహేందర్‌లు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.