నగరంలోని జూబ్లీహిల్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన చలిని తట్టుకోలేక ఓ ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు.

అయితే ఆ పొగ ఇల్లంతా వ్యాపించడంతో తల్లీ, కుమారుడు ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి చెందిన బుచ్చివేణి (37), పద్మరాజు(20)గా పోలీసులు గుర్తించారు. ఇద్దరు జూబ్లీహిల్స్‌ లోని ఓ ఇంట్లో పని చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.