చల్లా ధర్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపి౦చుకోవాలి

పరకాల టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపి౦చుకోవాలి ఆయ‌న సతీమణి చల్లా జ్యోతి.

ఈరోజు పరకాల పట్టణంలోని 11,12 (రాజీపేట) వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటువేసి చల్లా ధర్మారెడ్డి ని గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా చల్లా జ్యోతి మాట్లాడుతూ కొందరికి పరకాల అభివృద్ధి కనిపించడoలేదని, ధర్మారెడ్డి పరకాల పట్టణంలో అభివృద్ధి చేయలేకనే నన్ను ప్రచారంలో తిప్పుతున్నారన్న మాటలు వింటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ మాటలు మాట్లాడిన వారికి నేను ప్రచారంలో తిరగడమే ఎక్కువ అని ఎద్దేవచేశారు.

ధర్మారెడ్డి ప్రజల మనిషి, నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వారి అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నారు అన్నారు. ప్రజల్లో చల్లా ధర్మారెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు.

పరకాలలో తెరాస జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అన్నారు.