చికిత్స పొందుతూ యువతి మృతి
కడుపు నొప్పి భరించలేక ఎలుకల మందు తాగిన యువతి, చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. లెంకాలపల్లి గ్రామానికి చెందిన కన్నం పావని(19) గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పిని భరించలేక ఈ నెల 23వ తేదీ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
మృతురాలి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు.