చిట్ ఫండ్ కంపెనీ నగదును ఇవ్వక పోవడంతో అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు ఓ టీచర్. గొర్రె శ్రీనివాస్ అనే అతను మహబూబాబాద్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు వచ్చే నెల జీతంలోంచి, కపిల్ చిట్ ఫండ్ లో నెలకు రూ. 20వేల చొప్పున 50 నెలలకు గాను రూ.10 లక్షల చిట్ ను కట్టారు. అయితే గత డిసెంబర్ లో 49వ నెల పూర్తి అయింది. దీంతో చిట్ ను పాడాడు శ్రీనివాస్. అయితే నగదును ఇవ్వడానికి నెల గడువు పెట్టిన కపిల్ చిట్ ఫండ్ అధికారులు నాలుగు నెలలైనా మనీని శ్రీనివాస్ కు ఇవ్వలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా రిప్లే ఇవ్వక పోవడంతో కపిల్ ఆఫీస్ కు వచ్చి నిరసన చేశాడు. దీంతో 9 లక్షల చెక్ ను అందచేశారు.

ఇల్లు కట్టుకోవడానికి భూమిని కొనుగోలు చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు. కపిల్ చిట్ ఫండ్ లో నగదు వస్తే భూమి అమ్మిన వారికి ఇవ్వాలని చూసినట్టు చెప్పారు. అయితే కపిల్ అధికారులు ఎంతకీ నగదును ఇవ్వకపోవడంతో నిరసన చేయక తప్పలేదని చెప్పారు..