పటాస్ షో ద్వారా యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది శ్రీముఖి. ఈ షోలో ఆమె చేసే అల్లరి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అభిమానులు కూడా ఆమెకి రాములమ్మ అనే పేరు పెట్టుకున్నారు. ఇక ఈ షో తర్వాత బిగ్ బాస్ కి వచ్చేసి చివరి వరకు ఉంది రన్నరప్ గా నిలిచింది శ్రీముఖి. ఈ షో ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది శ్రీముఖి.

Advertisement

అయితే తాజాగా ఆమె మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ కి యాంకర్ గా వ్యవహరించింది. వరంగల్ లో నిర్వహించిన ఈ సక్సెస్ మీట్ కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. అందులో భాగంగా నటి విజయశాంతితో కలిసి ఫోటో దిగింది. దీనిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘లేడి అమితాబ్, రాములమ్మ విజయశాంతి నన్ను గుర్తుపట్టి చిన్న రాములమ్మ అని పిలిచారని, తన ఆనందానికి అవధుల్లేవని పేర్కొంది.

ఇది నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని, 2019 లో చిరంజీవి చేతుల మీదిగా అవార్డు అందుకోవడం, 2020లో విజయశాంతిని కలవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చాయని శ్రీముఖి పేర్కొంది. ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా కొనసాగుతూనే సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది