{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":27,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579531617339","total_editor_time":160,"total_draw_time":58305,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579531589227","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":2,"width":4096,"subsource":"done_button"}

చుక్కేసిన చక్కనమ్మలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు చుక్కలు చూపించారు. జూబ్లీహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు.

Advertisement

రోడ్‌ నంబరు 36, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10, చిరంజీవి రక్తనిధి కేంద్రం ఎదుట, రోడ్‌ నంబరు 45లో ఈ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ 60 మంది వాహనదారులు చిక్కారు. వీరిలో 32 మంది ద్విచక్ర వాహనదారులు, 28 మంది కార్ల యజమానులు ఉన్నారు. పట్టుబడిన వారిలో నలుగురు యువతులున్నారు. జూబ్లీహిల్స్‌లోని డైమండ్‌ హౌజ్‌ వద్ద నిర్వహించిన తనిఖీల్లో బెంగళూరుకు చెందిన ఓ యువతి మద్యం తాగినట్లు శ్వాస విశ్లేషణ పరీక్షల్లో బయటపడింది.

అదే ప్రాంతంలో టోలిచౌకికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు పట్టుబడగా ఆమె రక్తంలో మద్యం మోతాదు శాతం 130 ఎంఎల్‌గా వచ్చింది. మరో యువతికి వందకు పైగా వచ్చింది. చిరంజీవి రక్తనిధి కేంద్రం వద్ద మరో యువతి పట్టుబడింది. డైమండ్‌ హౌజ్‌ వద్ద పట్టుబడిన ముగ్గురు యువతులు శ్వాస విశ్లేషణ పరీక్షలకు సహకరించకుండా చాలా సమయం ఇబ్బందికి గురిచేశారు. ఒకరు కారులో నుంచి దిగకపోగా మరొకరు పోలీసులకు చిక్కకుండా పరుగు తీశారు. పట్టుబడిన 60 మందిపై కేసులు నమోదు చేశారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు..