చూసే దిక్కు లేదని మనస్తాపంతో వృద్ధురాలు

చూసే దిక్కు లేదని మనస్తాపంతో ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన మంగళవారం తాడిపత్రి ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది వివరాల ప్రకారం… యాడికి చింతరాయపల్లెకు చెందిన మెహరూన్‌ బీ (50) అనే వృద్ధురాలి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కూతురు రజీయా ఆమెను 10 రోజుల క్రితం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించింది. కూతురు రోజూ ఆమెను చూసుకొని ఇంటికి వెళ్ళేది. నిన్న మాత్రం కూతురు రాలేదు. దాంతో తననెవరూ చూసుకునే వారు లేరని మనస్తాపం చెందిన వృద్ధురాలు మహిళల వార్డులోని బాత్రూంకు వెళ్లి ఆమె చీరతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.