మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతను ఎక్కడ దూరమవుతాడోనని సొంత చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేసింది. విషయం చెల్లెలికి తెలియడంతో అక్క మోసం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: గుజరాత్ అహ్మదాబాద్ సబర్బన్ మణినగర్ కు చెందిన ఓ మహిళ తన సొంత మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్ది రోజుల తర్వాత అతడికి ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ ప్లాన్ వేసింది. అతను ఎక్కడ దూరమవుతాడనని ఇరు కుటుంబాల వారిని ఒప్పించి అతనికి తన సొంత చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేసింది.

పెళ్లి తర్వాత కూడా అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ విషయం గమనించిన చెల్లెలు ఆగ్రహంతో అక్క భర్తకు చెప్పింది. అయినా కూడా అతను సైలెంట్ గా ఉండిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఇంట్లో వాళ్లు కూడా విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువుపోతుంది సైలెంట్ గా ఉండు అని చెప్పారు. దీంతో ఆ మహిళ బాధపడుతూ అభయం హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పిందని సమాచారం. అభయం హెల్ప్ లైన్ కౌన్సిలర్లు వచ్చి కుటుంబం మొత్తానికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.