చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలు అరెస్ట్

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ కు చెందిన భక్తుల వద్ద క్యూలైన్లో చోరీకి పాల్పడుతుండగా భక్తులు మహిళలను పట్టుకుని ఎస్పీఎఫ్ సిబ్బందికి అప్పగించారు. ఆలయ చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి రూ.18 వేల నగదు, మూడు తులాల బంగారం స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు.