{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580660092752","total_editor_time":3,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1580660071458","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలోనే రాత్రి బసచేసి అక్కడి ఏర్పాట్లను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం జంపన్న వాగులో కుటుంబ సభ్యులతో కలిసి స్నానం చేశారు. అనంతరం సమ్మక్క- సారలమ్మ దగ్గర మంత్రి సత్యవతి రాథోడ్ తులభారం జరిగింది. అనంతరం అమ్మవార్లను దర్శించుకున్నారు.

జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు :

Advertisement

మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ మహా జాతర పురస్కరించుకొని మేడారంలో ఏర్పాటుచేసిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమం శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,

ములుగు జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, జాతర నోడల్ అధికారి వి. పి.గౌతమ్, ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతిరావు పాటిల్, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాంనాయక్ లను మేడారం జాతర కమిటీ సభ్యులు గిరిజన సంస్కృతి సాంప్రదాయ నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కొమ్ము కోయ నృత్యం, గుస్సాడీ నృత్యం భక్తులను అమితంగా ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఏ.పీవో చక్రధర రావు, జాతర పూజారులు జగ్గారావు, మునెందర్ తదితరులు పాల్గొన్నారు.