జనవరి 6న హన్మకొండలో జిల్లాస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల ఎంపికలు….

జనవరి 6వ తేదీన హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ఈద్గా మైదానంలో జిల్లాస్థాయి సబ్ జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్ బాల్ ఎంపికలు జరగనున్నాయి. వరంగల్ అర్బన్, భూపాలపల్లి, జనగామ జిల్లాలనుంచి క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.

అయితే ఈ క్రీడల్లో గెలుపొంది క్రీడాకారులకు జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండలో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు ఆసక్తిగల క్రీడాకారులు అందరు జనవరి 6 ఉదయం 10 గంటలకు బర్త్ సర్టిఫికెట్ తో ఈద్గా మైదానాల్లో హాజరుకావాలని సాఫ్ట్ బాల్ సంఘం జిల్లా కార్యదర్శి రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు.