జన్మించిన ప్రతి శిశువు వివరాలు పోర్టల్ లో ఉండాలి : కలెక్టర్ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌…..

వరంగల్‌లోని ఐఎంఏ హాల్‌లో గురువారం పోర్టల్‌పై నిర్వహించిన సమావేశానికి కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువు వివరాలను తప్పని సరిగా ఈ-బర్త్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఇందుకోసం ప్రతి ఆసుపత్రికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చినట్లు చెప్పారు. నోడల్‌ సిబ్బందిని నియమించి వైద్య ఆరోగ్యశాఖాధికారికి తెలియజేయాలన్నారు.