జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఓ పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

పోలీసుల వివరాల ప్రకారం: శుక్రవారం ఉదయం నలుగురు ఉగ్రవాదుల బృందం ఓ వ్యానులో ప్రయాణిస్తుండగా భద్రతాసిబ్బంది గుర్తించారు. నగ్రోటా చెక్‌పోస్టు వద్ద వారిని వారిని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ, ముష్కరులు వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లారు. వెంబడించిన భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా, మరో వ్యక్తి అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. అతడి కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది.