గత కొంతకాలంగా రాయ్ లక్ష్మీ ప్రచారార్భాటం గురించి తెలిసిందే . సెన్సేషన్స్ ఏమాత్రం ఆస్కారం ఉన్నా అస్సలు వదిలిపెట్టడం లేదు . ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఈ అమ్మడి క్రేజు అంతకంతకు పెరుగుతోంది . Instagram, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను అప్ లోడ్ చేస్తూ రాయ్ లక్ష్మీ అభిమానులకు టచ్ లో ఉంటోంది . ఇటీవల దిశా పటానీ కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల ప్రకటన సక్సెసవ్వడం అటుపై టైట్ ఫిట్ జిమ్ వేర్ లుక్ కి యూత్ లో ఆదరణ దక్కడంతో రాయ్ లక్ష్మీ ఆ దిశగా హాట్ కంటెంట్ ని పెంచేసి ప్రచారానికి పెడుతోంది . ఎవ్వర్ లేటెస్ట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది .

తాజాగా ఈ బ్యూటీ కొన్ని వేడెక్కించే ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది . జిమ్ కసరత్తులు చేస్తూ ఓ ప్రత్యేకమైన ఆసనంలో కూచుని ఉంది . జిమ్ ప్లస్ యోగా ఫార్ములాని కనిపెట్టింది . ఒకేసారి జిమ్ చేస్తూ యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఇలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేసింది . ప్రస్తుతం ఈ ఫోటోలు యూత్ లో అంతకంతకు వేడి పెంచుతున్నాయి . సెలబ్రిటీల రెగ్యులర్ జిమ్ యాక్టివిటీస్ ఇలా సామాజిక మాధ్యమాల్లోకి వస్తే అవి అంతే జోరుగా వైరల్ అయిపోతుండడంతో ఈ కొత్త ఎత్తుగడ తనకి బాగానే ప్రచారం తెచ్చి పెడుతోంది . ఇంతకీ రాయ్ లక్ష్మీ కెరీర్ సంగతేంటి ? అని ప్రశ్నిస్తే హడావుడి ఎక్కువ అసలు తక్కువ ! అన్నట్టే కనిపిస్తోంది . మెగాస్టార్ – ఖైదీనంబర్ 150లో రత్తాలుగా రఫ్పాడించిన రాయ్ లక్ష్మీకి ఐటెమ్ భామగా మరిన్ని ఛాన్సులు వెంటపడ్డాయి కానీ పూర్తి స్థాయి నాయికగా పెద్దగా వెలిగిపోయిందేమీ లేదు వరలక్ష్మి కేథరిన్ లతో కలిసి – నాగకన్య – అనే ఓ ప్రయోగాత్మక గ్రాఫిక్స్ చిత్రంలో నటిస్తోంది .

“ ఒరు కుట్టదు బ్లాక – అనే మలయాళ చిత్రం లో నటించింది . – సైరా నరసింహారెడ్డిలో ఓ పాత్రకు ఎంపికైందని వార్తలు వచ్చినా అవేవీ కన్ఫామ్ కాలేదు . జూలీ 2 తర్వాత హిందీలోనూ ఛాన్సులేవీ రాలేదు . అయితే తెలుగు తమిళంతో పాటు హిందీలోనూ కొత్తగా ప్రయత్నాలు సాగిస్తోందిట . రెగ్యులర్ జిమ్ లుక్ తో ఇలా వేడి పెంచేస్తే మన దర్శక నిర్మాతలు ఛాన్సులిచ్చేస్తారంటారా ?