జిల్లా లో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (మార్చ్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలూ, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. గారు హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు , వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయం లో సహకరించాలని తెలిపినారు.

S.P. కుమారి జి.చందనా దీప్తి గారి ఆదేశానుసారం

గురువారం రోజున పౌర హక్కుల రోజు ను పురస్కరించుకొని మేదక్ జిల్లా ఎస్.పి. కుమారి జి.చందనా దీప్తి ఐపిు‌ఎస్ గారి ఆదేశానుసారం జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ల పరిధి లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.