జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా యస్.పి. కుమారి చందన దీప్తి గారు జిల్లా పోలీసు అధికారులతో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేషంలో జిల్లా అదనపు యస్.పి. శ్రీ డి.నాగరాజు గారితో పాటు మెదక్, తూప్రాన్ సబ్ డివిజన్ లకు సంబంధించిన డి.యస్.పి. లు , సి.ఐ.లు మరియు యస్.ఐ.లు పాల్గొన్నారు. ఈ సమావేశం లో యస్.పి. గారు గత నెలలో జరిగిన నేరాల గురించి సిబ్బందిని కూలంకశముగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.పి గారు మాట్లాడుతూ…. శాసనసభ ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుండి ఎన్నికల ఓట్ల లెక్కింపు వరకు ఎలాంటి అవాంచనీయ సంగటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేల పని చేసిన జిల్లా పోలీస్ సిబ్బందిని అబినందించారు.

అదేవిదంగా నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో పాటు వివిధ గ్రామాల్లో నెలకోల్పబడుతున్న సి.సి కెమెరాల పనీతీరును మరింత మెరుగుపర్చి తద్వారా నేరాల నియంత్రణలో పోలీసులకు పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్లో పని చేసి సిబ్బందికి 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా నిర్ణితమైన ఉద్యోగం కల్పించడం జరుగుతుందని తెలిపారు, తదనుగుణంగా తమ సిబ్బంది తమకు కేటాయించిన భాద్యతను సక్రమంగా నిర్వర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే మెదక్ జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో వాహనాల రద్దీ కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వాటి నివారణకు ఎన్ఫోర్సుస్మేంట్ లో భాగంగా ఈ చలాన్ విదానాన్ని అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిదంగా ప్రజలు కూడా ట్రాఫిక్ నియమ నిభందనలు పాటిస్తూ పొలిసు వారికి సహకరించాలని కోరినారు. రోడ్డు ప్రమాదాల విషయంలో మూల మలుపులలో , ప్రమాదాలు జరిగే చోట్లలో సూచిక బోర్డ్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేలా చూడాలని ఈ సంధర్భముగా అధికారులకు సూచించారు.

అదేవిదంగా ఈ పెట్టి కేసులను ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించినారు. మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడుతూ ఏవరైన తప్పి పోయారు అని లేదా కనిపించుటలేదు అని ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫోటోని అన్ని పోలిస్టేషన్లకు పంపించి మిస్సింగ్ వ్యక్తులను కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో పెండింగ్ లో వున్నా నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేయాలని ఆదేశాలు చేసినారు. ఇసుక మాఫియా, గ్యాంబ్లింగ్ లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాల పై ప్రత్యేక నిఘా వుంచాలని చెప్పారు. దొంగతనాల నివారణ గురించి పగలు రాత్రి గట్టి పెట్రొలింగ్ మరియు బీట్లు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేషంలో మెదక్, తూప్రాన్ డి.యస్.పి. లు శ్రీ. కృష్ణమూర్తి గారు, శ్రీ.రాంగోపాల్ రావ్ గారు,సి.ఐ.లు, యస్.ఐ.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.